![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -374 లో.. కృష్ణ మురారి లు ఆదర్శ్ ని తీసుకొని రావడానికి వెళ్తారు. ఆదర్శ్ కి జరిగింది మొత్తం చెప్తారు. కానీ ఆదర్శ్ మాత్రం మొదట ఇంటికి రావడానికి ఇష్టపడడు. ఆ తర్వాత కృష్ణ ఇప్పుడు ముకుంద మారిపోయిందని, నీకోసం ప్రేమ గా ఎదురుచూస్తుంటుందని కన్విన్స్ చెయ్యడంతో ఆదర్శ్ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్ అంటు ఇంటికి వచ్చాక ఏం జరిగిన మీదే బాధ్యత అని ఆదర్శ్ అనగానే కృష్ణ సరేనని అంటుంది.
ఆ తర్వాత వాళ్ళు రావడానికి ముందు ఇంట్లో జరిగిన గొడవ గురించి ఆదర్శ్ కి కృష్ణ చెప్తుంది. మరొకవైపు కృష్ణ మురారీలకి ఎంత ట్రై చేసిన ఫోన్ కలవకపోవడంతో.. ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు. ఒక పక్క ముకుంద.. కృష్ణ, మురారీలు ఆదర్శ్ ని కలిసారా తీసుకొని వస్తున్నారా అని భయపడుతుంది. ఆ తర్వాత మురారి తన చిన్నతనంలో చేసిన అల్లరి గురించి ఆదర్శ్ , మురారీలు కలిసి కృష్ణకి చెప్తాడు. అలా సరదాగా వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకుచేసుకుంటు కృష్ణకి చెప్తారు. ముకుంద నీ కోసం వెయిట్ చేస్తుందని కృష్ణ అనగానే.. నాకెందుకో మీరు భ్రమ పడుతున్నారని అనిపిస్తుందని ఆదర్శ్ అంటాడు. అలా ఏం కాదు నిజమే.. ముకుంద మారిందని ఇద్దరు చెప్తారు. ఆ తర్వాత భవానికి కృష్ణ కాల్ చేసి ఆదర్శ్ ని కలిసామని.. రేపు ఇంటికి తీసుకొని వస్తున్నామని చెప్పగానే భవానీతో పాటుగా ఇంట్లో వాళ్ళు చాల సంబరపడిపోతారు. ముకుంద మాత్రం టెన్షన్ పడుతుంది. మధు గమనిస్తున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు నటిస్తు ఉంటుంది.
ఆ తర్వాత ఆదర్శ్ కి గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్పాలని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ముకుంద డల్ గా ఉండడంతో.. ఆదర్శ్ రావడం ముకుందకి ఇష్టం లేదని మధు అనుకుంటాడు. ఆ తర్వాత ఆదర్శ్ వస్తే ఇప్పుడు నేనేం చెయ్యాలి.. ప్రేమించిన వాడు పక్కన ఉంటే.. వేరేవాళ్ళతో ఎలా ఉంటాను. నేను మారిపోయానని ఎంత ఆశగా ఆదర్శ్ వస్తున్నాడో? మళ్ళీ మురారి ప్రేమ కోసం ట్రై చెయ్యాలా అంటూ ముకుంద సతమతమవుతుంటే మధు వస్తాడు. ఏమైంది అలా ఉన్నావని అడుగగా.. ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. కానీ మధుకి మాత్రం డౌట్ వస్తుంది. ఆదర్శ్ వచ్చాక ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో.. దానికి కూడ కృష్ణ బాధ్యత తీసుకుంది. అప్పుడు కూడా కృష్ణ మాటలు పడాల్సి వస్తుందని మధు అనుకుంటాడు. తరువాయి భాగంలో కృష్ణ, మురారి ఇద్దరు ఆదర్శ్ ని తీసుకొని ఇంటికి రావడంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |